ఇప్పుడు ఉన్న పాన్ ఇండియా లెక్కల్ని కమల్ హాసన్ ఎప్పుడో రీచ్ అయ్యారు. కమల్ చేసిన ప్రతి సినిమా భాషా భేదం లేకుండా అన్ని ప్రాంతీయ భాషల్లో రిలీజ్ అయ్యేవి. కమల్ హాసన్ చెప్పుకోవటానికి కోలీవుడ్ యాక్టర్ అయినా అందరు ఓన్ చేసుకున్నారు. కమల్ కి అన్ని భాషల్లోనూ మంచి మార్కెట్ ఉంది. అలాంటి కమల్ హాసన్ మార్కెట్ చెర్రీ ముందు వెల వెల పోయింది. శంకర్ డైరక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ హిందీ థియేట్రికల్ రైట్స్, 75 కోట్లకి అమ్ముడైన సంగతి తెలిసిందే. భారీ పోటీ మధ్య అనిల్ తడాని ఈ రైట్స్ ని దక్కించుకున్నారు. కానీ అదే శంకర్ డైరెక్ట్ చేసిన కమల్ హాసన్ భారతీయుడు 2 హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ కేవలం 20 కోట్లకి లాక్ అయ్యింది.
కమల్ కెరియర్ లో భారతీయుడు సినిమాకి ప్రత్యేక స్థానముంది. 1996 లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ హిట్ అందుకుంది. దాదాపు 28 ఏళ్ళ తరవాత సీక్వెల్ వస్తోంది. శంకర్ భారతీయుడు సినిమాపై మమకారంతో సీక్వెల్ మొదలు పెట్టి అనేక అవాంతరాలు, వివాదాలు మధ్య రీసెంట్గా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇదే టైమ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ కూడా మొదలుపెట్టారు. ఈ రెండు దగ్గర దగ్గరగా రిలీజ్ కానున్న నేపథ్యంలో రైట్స్ విక్రయించే పనిలో పడ్డారు. ఈ రెండూ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావటం గమనార్హం.
భారతీయుడు 2 ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా, గేమ్ చేంజర్ ని దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. బిజినెస్ పరంగా కమల్ కంటే చెర్రీ ఎన్నో రేట్లు ముందున్నాడు. హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ గేమ్ చేంజర్ 75 కోట్లకి అమ్ముడయితే, 'భారతీయుడు 2 ' కేవలం 20 కోట్లకి మాత్రమే వెళ్ళింది. ఎవరి క్రేజ్ ఏంటో తెలుసుకోవటానికి ఈ డీల్ నిదర్శనం. చెర్రీ ప్రజంట్ గ్లోబల్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. అందుకే చరణ్ కి క్రేజీ మార్కెట్ ఉంది. డిజిటల్ రైట్స్ లో కూడా గేమ్ చేంజర్ కి భారీ ఆఫర్స్ లభిస్తున్నాయని సమాచారం. విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఉన్నా కమల్ మార్కెట్ చెర్రీముందు దిగదుడుపు అయింది.