గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూడేళ్ళ తరువాత 'గేమ్ ఛేంజర్' తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. RRR సినిమా తరువాత చెర్రీ నుంచి వచ్చిన గేమ్ చేంజర్ మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ తో దూసుకు పోతోంది. వరల్డ్ వైడ్ గా జనవరి 10న రిలీజ్ అయిన ఈ చిత్రంతో చెర్రీ పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈమూవీలో చెర్రీ డ్యూయల్ రోల్ లో కనిపించి మెప్పించాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చెర్రీ చూపించిన నటనకి ఫాన్స్ తో పాటు మిగతావారు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతికి పవర్ ఫుల్ ప్యాక్డ్ మూవీగా నిలిచింది. ఈ పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. గేమ్ చేంజర్ మొదటి రోజే రికార్డ్ స్థాయిలో వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఫస్ట్ డే 186 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. మూవీ టీమ్ అఫీషియల్ గా ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది.
ఆ పోస్టర్ లో 'ఈ మాస్ ఎంటర్ టైనర్ బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ ను సాధించింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది' అని ట్వీట్ చేసింది. దీంతో మెగా ఫాన్స్ లో ఆనందం వెల్లివిరిసింది. ఇక సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇంకెన్ని వసూళ్లు సాధిస్తుందో చూడాలి. బుక్ మై షోలో ఇప్పటికి 1.3 మిలియన్లకు పైగా గేమ్ ఛేంజర్ టికెట్లు బుక్ అయినట్లు తెలుస్తోంది.