మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ప్రముఖ హిందీ సినీ విలేఖరి కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన అంశాలని అందరితో పంచుకున్నాడు. ముఖ్యంగా అందులో తాను త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి చేయబోయే చిత్రం గురించిన విశేషాలు ఉన్నాయి.
అయితే తనకి ఆ సినిమా కథ ఎలా ఉండబోతున్నది అన్న విషయం చెప్పకుండానే జాగ్రత్తపడ్డాడు. దీనికి కారణం, దర్శకుడు రాజమౌళి తమకి ఇంకా పూర్తి కథ ఇంకా చెప్పలేదు అని చెప్పాడు. అయినా సరే ఇంకా ఏదైనా చెప్పగలరా అని అడగగా- తనకి ఏ మాత్రం తెలియదు అంటూ బదులు ఇవ్వడం జరిగింది.
ఇక చివరికి, ఈ చిత్రం బాక్సింగ్ నేపధ్యంలో సాగుతుంది అని ప్రశ్నించగా- “బాక్సింగ్ నేపధ్యంలో అయితే ఉండదు అని మాత్రం చెప్పగలను”. దీనితో ఇప్పటివరకు బాక్సింగ్ అంటూ సాగిన ఊహాగానాలకి తెరపడినట్టయింది. అలాగే ఈ చిత్ర షూటింగ్ ఈ సంవత్సరం అక్టోబర్ తరువాత నుండి మొదలవ్వనుంది అని తెలిపాడు చెర్రి.
ఏదేమైనా.. #RRR గురించిన కొన్ని కొన్ని చిన్న అంశాలైతే బయటకి వచ్చాయి.