మహానటికి ఫిదా అయిపోయిన మంత్రిగారు...

By iQlikMovies - May 10, 2018 - 11:50 AM IST

మరిన్ని వార్తలు

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కడ విన్నా చూసినా వినిపిస్తున్న అలాగే కనిపిస్తున్న మాట- మహానటి. ఈ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయి కూర్చుంది, ఈ చిత్రం చూసిన సామాన్య ప్రజలే గాక ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

ఆ ప్రముఖుల జాబితాలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా చేరిపోయారు. ఆయన ఈ చిత్రాన్ని చూసాక వెంటనే, ఈ చిత్రం తనకెంత నచ్చిందో అన్నది తన ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని ఇంత అద్బుతంగా తెరకెక్కించిన దర్శకుడు నాగ అశ్విన్ అలాగే నిర్మాతలని, నటులని పొగడ్తలతో ముంచెత్తాడు.

ఇక నిన్నటిరోజున మహానటి చిత్రానికి ఫిదా అయిపోయిన రాజమౌళి, రాఘవేంద్రరావు లు కూడా ఈ చిత్రం పైన పొగడ్తల వర్షం కురిపించేశాడు. అలాగే ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నది.

మొత్తానికి ఈ మహానటి చిత్రం అన్ని రంగాల వారిని ఆకట్టుకుంటున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS