మన హీరోలు.. తెర పైనే కాదు.. బయటా హీరోలే. వీలున్నప్పుడల్లా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. యువతలో చైతన్యం తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వచ్చింది. తెలంగాణ టీఆర్ఎస్ ఎంపి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినీ సెలబ్రెటీలు మొక్కలు నాటుతున్నారు.
తాము నాటడమే కాదు... మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతున్నారు. అలా ప్రభాస్... రామ్ చరణ్‌కి ఈ ఛాలెంజ్ ఫ్వార్వడ్ చేశాడు. దాన్ని స్వీకరించిన చరణ్ ఈ రోజు... మొక్కల్ని నాటాడు. అంతే కాదు... రాజమౌళికి, అలియా భట్ కీ, ఆర్.ఆర్.ఆర్ టీమ్ కీ ఈ ఛాలెంజ్ విసిరాడు. తన అభిమానులకూ... మొక్కలు నాటమంటూ సందేశం పంపాడు. రామ్ చరణ్ మొక్కలు నాటిన ఫొటోలూ.. వీడియోలూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.