రామ్‌చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. `వినయ విధేయ రామ` అనే పేరు పరిశీలిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఎందుకనో దాయన్య సెట్‌కి రావడం లేదట. ప్లానింగ్ అంతా రామ్ చరణ్ చూసుకుంటున్నాడన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. రామ్‌చరణ్ కి అత్యంత సన్నిహితుడు, మేనేజర్ ప్రవీణ్ ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటున్నాడని, ఆర్థిక లావాదేవీలు ప్రవీణ్ చేతుల మీదుగా జరుగుతున్నాయట. దానయ్య పని కేవలం చెక్కుల మీద సంతకాలు చేయడమే. అంటే ఓ విధంగా ఈ ప్రాజెక్టు మొత్తం చరణ్ చేతుల్లోకి వెళ్లిపోయినట్టే.
చరణ్ కి నిర్మాతగా అనుభవం ఉంది. `ఖైది నెం.150`కి తానే ప్రొడ్యూసర్. ఇప్పుడు సైరాకీ తనే నిర్మాత. ఆ అనుభవంతోనే ఈ బాధ్యతలు చక్కబెడుతున్నాడని, దాయన్య అసలు సెట్‌కే రావడం లేదని, ఆయన పని కేవలం చెక్కులపై సంతకాలు చేయడమే అని వినికిడి.
క్వాలిటీ, పబ్లిసిటీ విషయంలో రాజీ పడకుండా ఉండడానికే చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడా, లేదంటే వేరే వ్యవహారాలేమైనా జరిగాయా? అనేది మాత్రం తెలియాల్సివుంది.