లక్ష్మీ పార్వతి పాత్రలో శ్రీరెడ్డి.?

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ బయోపిక్స్‌ ఇప్పుడు సంచలన చిత్రాలుగా చెప్పుకోవాలి. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ది ఓ దారైతే, సంచలన దర్శకుడు వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'ది మరో దారి. ఇక ముచ్చటగా మూడో బయోపిక్‌ 'లక్ష్మీస్‌ వీరగ్రంధం'. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటర్‌ అయిన దగ్గర నుండీ ఆయన జీవితంలో వచ్చిన మార్పుల్ని వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'లో చూపిస్తుంటే, అంతకు ముందు లక్ష్మీ పార్వతి ఎవరు? ఏంటీ.? అనే అంశాలను హైలైట్‌ చేస్తూ సినిమా రూపొందిస్తున్నామని గతంలోనే నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చెప్పారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫ్రెష్‌ అప్‌డేట్‌ ఏంటంటే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో అంటే లక్ష్మీ పార్వతి పాత్రలో నటించబోయేదెవరో తెలుసా? 'శ్రీరెడ్డి'. 

ఈ పేరుకు పరిచయం అస్సలు అక్కర్లేదు. ఈ మధ్య కాస్టింగ్‌ కౌచ్‌ అంటూ అర్ధ నగ్న ప్రదర్శనతో రచ్చ రచ్చ చేసిందీ అమ్మడు. ఈమెను తీసుకొచ్చి తన సినిమాలో ప్రధాన పాత్రధారిని చేస్తానంటున్నారు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. అసలింతకీ ఈ సమాచారమ్‌ లక్ష్మీపార్వతికి చేరిందా.? చేరితే ఆమె ఒప్పుకుందా.? తన పాత్రలో ఏమైనా లోటు పాట్లు కానీ, అభ్యంతరకర అంశాలు కానీ ప్రస్థావిస్తే తానేమాత్రం ఊరుకోననీ లక్ష్మీపార్వతి గతంలో కేతిరెడ్డిపై ఫైర్‌ అయిన సంగతి తెలిసిందే. 

మరి ఇప్పుడు తన పాత్రలో ఏకంగా శ్రీరెడ్డిలాంటి నటిని తీసుకుంటే లక్ష్మీపార్వతి ఎలా అంగీకరిస్తారో.? చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS