చిరు సినిమాలో చ‌ర‌ణ్ ఉన్న‌ట్టేనా?

By Gowthami - January 07, 2020 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

చిరంజీవి - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ సినిమా మొదలైంది కూడా. అయితే ఇందులో రామ్ చ‌ర‌ణ్ కూడా న‌టిస్తార‌ని, చిరంజీవి యువ‌కుడిగా ఉన్న సీన్ల‌న్నీ చ‌ర‌ణ్‌పై చిత్రీక‌రిస్తార‌ని చెప్పుకున్నారు. అయితే వీటిపై అటు చ‌ర‌ణ్ గానీ, ఇటు చిత్ర‌బృందం గానీ ఎలాంటి వివ‌ర‌ణా ఇవ్వ‌లేదు. అయితే ఈ సినిమాలో చ‌ర‌ణ్ ఉండ‌డం ఖాయంగానే అనిపిస్తోంది. ఏప్రిల్ నుంచి నెల రోజుల పాటు కొరటాల శివ‌కు డేట్లు ఇచ్చాడ‌ట రామ్‌చ‌ర‌ణ్‌. మార్చిలో `ఆర్‌.ఆర్‌.ఆర్‌` షూటింగ్ పూర్తి అవుతుంది. ఆ త‌ర‌వాత కొర‌టాల సినిమాకి చ‌ర‌ణ్ అందుబాటులో ఉంటాడ‌ని తెలుస్తోంది.

 

నెల రోజుల పాటు చ‌ర‌ణ్‌పై స‌న్నివేశాల‌న్నీ తెర‌కెక్కించేస్తార్ట‌. ఈలోగా చిరంజీవి పార్ట్ పూర్తి చేయాల‌ని కొర‌టాల భావిస్తున్నాడు. చిరు యంగ్ ఏజ్ సీన్ల‌లో చ‌ర‌ణ్ క‌నిపిస్తాడు కాబ‌ట్టి చిరు - చ‌ర‌ణ్ మ‌ధ్య కాంబినేష‌న్ సీన్లు లేవు. అయితేనేం... ఒకే సినిమాలో చిరు, చ‌ర‌ణ్‌ల‌ను చూడ‌డం మెగా అభిమానుల‌కు బంప‌ర్ ఆఫ‌రే. అయితే దీనిపై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సివుంది. త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. ఆగ‌స్టు 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS