చరణ్‌ పెద్ద స్కెచ్చే వేశాడు

మరిన్ని వార్తలు

చరణ్‌ - సుకుమార్‌ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీ హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఇంతవరకూ స్టైలిష్‌ లుక్స్‌తో ఆకట్టుకున్న చరణ్‌ ఈ సినిమాతో ఓ పల్లెటూరి కుర్రాడి పాత్రతో మన ముందుకు రాబోతున్నాడు. ఇదే కొత్త సినిమాలో చరణ్‌ లుక్‌ అంటూ వచ్చిన ఓ ఆర్ట్‌ డ్రాయింగ్‌తో జనంలో క్యూరియాసిటీని పెంచేస్తున్నాడు చరణ్‌. అదేంటి చరణ్‌ బాడీ లాంగ్వేజ్‌ ఎంతో స్టైలిష్‌గా ఉంటుంది. అలాంటిది ఇంత మాస్‌ క్యారెక్టర్‌లో చరణ్‌ ఎలా నటిస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. అలాగే ఈ లుక్‌కి మాత్రం విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఇది కేవలం ఆర్ట్‌ డ్రాయింగ్‌ మాత్రమే. అలాంటిది ఈ గెటప్‌కే ఇంత మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇక రాబోయే ఫస్ట్‌లుక్‌ చూసి అంతా అవాక్కవుతారట. అంత అదిరిపోయే ఫస్ట్‌లుక్‌ని ప్లాన్‌ చేస్తోందట చిత్ర యూనిట్‌. ఈ గెటప్‌ని అంత తేలిగ్గా ఏమీ చరణ్‌ టేకప్‌ చేయలేదంట. పల్లెటూరి కుర్రోడి పాత్రలో తనను తాను చూసుకునేందుకు ఆ పాత్రపై ఎంతో రీసెర్చ్‌ చేశాడట చరణ్‌. అలాగే తెలుగు సినీ చరిత్రలోనే ఈ సినిమా ఓ అద్భుత కావ్యంగా తెరకెక్కుతోందట. చాలా చాలా స్పెషాలిటీస్‌ ఉన్నాయట ఈ సినిమాలో. అందుకే చరణ్‌ ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చాడట. ఏది ఏమైనా ఈ సినిమా తనకి చాలా స్పెషల్‌ అంటున్నాడు చరణ్‌. 'ధృవ' సినిమాలో సిక్స్‌ ప్యాక్‌తో స్టైలిష్‌గా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో చరణ్‌ ఇంకెంత మెప్పిస్తాడో చూడాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS