రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా ఏళ్లుగా ఇద్దరి బాండింగ్ కొనసాగుతోంది. సల్మాన్ హైదరాబాద్ ఎప్పుడొచ్చినా చరణ్ ఇంటి నుంచి భోజనం వెళ్లాల్సిందే. చరణ్ ముంబై వెళ్లినప్పుడల్లా సల్మాన్ తో ములాఖాత్ గ్యారెంటీ. ఆర్.ఆర్.ఆర్... ముంబై ప్రమోషన్లలో సల్మాన్ పాల్గొన్నాడు. అంతే కాదు.. చిరంజీవి `గాడ్ ఫాదర్`లో ఓ చిన్న కామియో చేశాడు. అది కూడా ఎలాంటి పారితోషికం తీసుకోకుండా.
ఇప్పుడు చరణ్‌కి బాకీ తీర్చుకొనే అవకాశం వచ్చింది. గాడ్ ఫాదర్ లో.. సల్మాన్ కామియో చేసినట్టే, ఇప్పుడు సల్మాన్ సినిమాలో చరణ్ గెస్ట్ గా అవతారం ఎత్తేశాడు. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం కభీ ఈద్ - కభీ దివాలీ. ఈ సినిమాలో వెంకటేష్, పూజా హెగ్డే కూడా నటిస్తున్నారు. ఇందులో చరణ్ ఓ పాటలో కనిపించనున్నాడు. సల్మాన్, వెంకీ, పూజాలతో కలిసి చరణ్ స్టెప్పులు వేశాడట. ఈ పాట ఈ సినిమాకే హైలెట్ కానుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్‌తో చరణ్ క్రేజ్ బాలీవుడ్ లోనూ బాగా పెరిగింది. ఇలాంటి తరుణంలో చరణ్ రాక.. తన సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని సల్మాన్ భావించాడు. సల్మాన్ అడగ్గానే చరణ్ కూడా ఒప్పుకోవడంతో... గాడ్ ఫాదర్ బాకీ తీరినట్టైంది.