వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు బోయపాటి శ్రీను. దమ్ము మినహాయిస్తే.. ఆయన కెరీర్‌లో కనిపించేవన్నీ సూపర్ హిట్లే. తాజాగా విడుదలైన జయ జానకి నాయక కూడా బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితాన్నే సాధించింది. అందుకే.. బోయపాటితో సినిమా చేయడానికి బడా హీరోలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. చిరంజీవి 152వ చిత్రానికి బోయపాటి నే దర్శకుడు. బాలయ్య 103వ చిత్రాన్నీ బోయపాటి చేతుల్లోనే పెట్టబోతున్నారు. మహేష్, అఖిల్ లైన్‌లో ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా బోయపాటి తో పనిచేయాలని ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్. ఈ విషయమై చరణ్ బోయపాటిని సంప్రదించాడని తెలుస్తోంది. అయితే బోయపాటి తన నిర్ణయాన్ని ఇంకా తెలియజేయలేదట. ఒకవేళ చరణ్‌కి తగిన కథ ఉన్నా... అది ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదు. రంగస్థలం తరవాత కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడు చరణ్. ఆ తరవాతే బోయపాటి సినిమా ఉండొచ్చు.