'మా' వివాదంపై స్పందించిన రామ్‌చరణ్‌.!

మరిన్ని వార్తలు

హ్యాపీ మొబైల్స్‌ సంస్థకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడలో ఏర్పాటు చేసిన హ్యాపీ మొబైల్‌ షోరూమ్‌ని రామ్‌చరణ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేఖర్లు అడిగిన పలు ప్రశ్నలకు రామ్‌ చరణ్‌ సమాధానమిచ్చారు. ఆ క్రమంలో రీసెంట్‌గా 'మా' డైరీ ఆవిష్కరణలో భాగంగా తలెత్తిన వివాదంపై రామ్‌చరణ్‌ అభిప్రాయం ఏంటని అడగ్గా, ఈ వివాదానికి సంబంధించి, సినీ పెద్దలు సమిష్టిగా దృష్టి సారించారనీ త్వరలోనే ఈ వివాదాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారనీ రామ్‌ చరణ్‌ తెలిపారు. అలాగే, 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ దాదాపు 75 శాతం పూర్తయ్యిందనీ, సమ్మర్‌ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నామనీ తెలిపారు.

 

ఇదంతా బాగానే ఉంది. ఆవలిస్తే, పేగులు లెక్క పెట్టే జనం, ఇందులోంచి ఓ అనుమానాన్ని తవ్వి తీశారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' రిలీజ్‌ డేట్‌ ఆల్రెడీ కన్‌ఫామ్‌ కదా..! చరణ్‌ ఇలా (సమ్మర్‌ రిలీజ్‌ ప్లానింగ్‌) అన్నాడేంటీ.? అనే అనుమానాలు లేవనెత్తుతున్నారు. అన్నట్లు ఈ మధ్య 'మత్తు వదలరా' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రాజమౌళి కూడా 'ఆర్‌ఆర్‌ఆర్‌' రిలీజ్‌ డేట్‌ని సందిగ్ధంలో పడేశారు. చిన్న సినిమా (మత్తు వదలరా)కే రెండేళ్ల టైమ్‌ తీసుకుంటే, పెద్ద సినిమా అయ్యుండి ఇంకెన్నాళ్లు పడుతుందో.? అన్నట్లు డౌట్‌ ఎక్స్‌ప్రెస్‌ చేశారు. అంటే, 'ఆర్‌ఆర్‌ఆర్‌' ముందుగా ప్రకటించినట్లు జూలై 30న విడుదలవుతుందా.? లేదా.?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS