రామ్ చరణ్ , ఎన్టీఆర్ మంచి ఫ్రండ్స్. ఇద్దరూ కలసి ఆర్ఆర్ఆర్ చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన ఆ వేడుకకు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, ఎన్టీఆర్‌తో కలిసి హాజరైన చరణ్ అక్కడి మీదితా ప్రత్యేకంగా ముచ్చటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబంతో పోటీ గురించి తన మనసులో మాట చెప్పాడు.
‘‘ సుమారు 30 ఏళ్ల నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో ఆరోగ్యకర పోటీ వాతావరణం ఉంది. తారక్ తాతగారు నందమూరి తారకరామారావు గారు, మా నాన్న చిరంజీవి గారు మధ్య హెల్దీ కాంపిటిషన్ ఉండేది. అలాంటిది రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం మా ఇద్దరిని ఎంపిక చేశారు. తారక్‌తో కలిసి మరో సినిమా చేయాలనుంది'' అని చెప్పుకొచ్చారు చరణ్.