'ఎంత సక్కగున్నావే..' అంటూ రంగస్థలం నుండి తొలి సాంగ్ విడుదలయ్యాక అందరి దృష్టీ నెక్స్ట్ రాబోయే సాంగ్ మీదే పడింది. ఆ సాంగ్ ఐటెం సాంగ్ అనీ అంటున్నారు. ముద్దుగుమ్మ పూజా హెగ్దే ఈ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఇటీవలే ఈ సాంగ్ చిత్రీకరణ జరిగింది. ఇకపోతే ఈ సాంగ్‌లో నటించేందుకు ముద్దుగుమ్మ పూజా హెగ్దే తీసుకున్న రెమ్యునరేషన్ కూడా ఎక్కువనీ ప్రచారం జరుగుతోంది. అది ఎంత అంటే, అక్షరాలా 50 లక్షలు..అనీ అంటున్నారు.
అయితే ఆమె కెరీర్లో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినప్పటికీ, ఇంత రెమ్యునరేషన్ ఇచ్చి ఈ ముద్దుగుమ్మని స్పెషల్ సాంగ్ కోసం ఎంచుకున్నారంటే అమ్మడి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పూజా హెగ్దే కెరీర్లో 'ముకుందా', ఒక లైలా కోసం' సినిమాలు ఫర్వాలేదనిపించినా, 'డీజె' మాత్రం నిరాశపరిచిందనే చెప్పాలి. అయినా కానీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏంటో తెలీడం లేదు.
ఇకపోతే లవర్స్‌డే సందర్భంగా విడుదలైన 'ఎంత సక్కగున్నావే..' సాంగ్ తర్వాత పూజా ఐటెం సాంగ్‌నే చిత్ర యూనిట్ నెక్స్ట్ రిలీజ్ చేయనుందనీ టాక్ వినిపిస్తోంది. అయితే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మరోటి ఉందట. ఆ సాంగ్‌ని రిలీజ్ చేసే యోచనలో సుకుమార్ ఉన్నట్లు మరో పక్క అందుతున్న సమాచారమ్. ఏది ఏమైనా సుకుమార్ సినిమాలోని సాంగ్స్కున్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. ఏ సాంగ్ అయినా కానీ తన ప్రత్యేకతను చాటుకునేలానే ఉంటాయనడంలో అతిశయోక్తి కాదు.
ఈ విషయాలన్నీ పక్కన పెడితే, పూజా హెగ్దే కెరీర్‌కి ఈ 'రంగస్థలం' స్పెషల్ సాంగ్ అయినా కలిసొస్తుందేమో చూడాలిక.