చరణ్ రంగస్థలం స్టొరీ లీక్?

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం చిత్రం గురించిన ఒక వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నది.

అదేంటంటే- తమిళ హీరో ఆది పినిశెట్టి ఈ చిత్రంలో రామ్ చరణ్ అన్న పాత్రలో కనిపించనున్నాడు అని అలాగే ఆ పాత్ర కొద్దిగా విలన్ ఛాయలతో ఉంటుంది అట! ఇక ఆ పాత్ర కూడా సినిమా చివరిలో మరణిస్తుంది అన్నది ఆ వార్త సారాంశం.

ఇక ఈ చిత్రం అన్నదమ్ముల భావోద్వేగాలతో కూడిన కథతో రూపొందుతున్నది అని తెలుస్తున్నది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉన్నది లేనిది సినిమా విడుదల అయితే తప్ప తెలియదు.

మొత్తానికి రంగస్థలం చిత్రం విడుదల కాకముందే అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS