మొదలైన ‘సైరా’

మరిన్ని వార్తలు

ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం ఎట్టకేలకు ఈరోజు మొదలైంది. కొద్దిసేపటి క్రితం సైరా నరసింహ రెడ్డి ముహూర్తం షూటింగ్ ప్రారంభమైంది. ఇక ఈ ప్రారంభానికి దర్శకుడు సురేందర్ రెడ్డి, రామ్ చరణ్, DOP రత్నవేలు పలువురు హాజారయ్యారు. 

ఈ విషయాన్ని మెగా కోడలు ఉపాసన తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇది మెగా ఫ్యామిలీకి గొప్ప ప్రారంభం అని ఉపాసన ట్విట్టర్‌లో పేర్కొంది. మామ చిరంజీవి, భర్త చరణ్‌కి సంబంధించిన విషయాలను ఉపాసన ఎప్పటికప్పుడే ట్విట్టర్‌లో షేర్‌ చేసుకునేందుకు యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగా మామ చిరంజీవికి 151వ చిత్రంగా, మిస్టర్‌.సి (చరణ్‌)కి నిర్మాతగా రెండో చిత్రంగా ఈ చిత్రం ఈ రోజు నుండి ప్రారంభం కాబోతోంది. ''సైరా నరసింహారెడ్డి పాత్ర, చిత్ర బృందం ఈ సినిమాతో అభిమానులందర్నీ మెస్మరైజ్‌ చేస్తాయి..' అని ఉపాసన పేర్కొంది.

ఈ సినిమాలో సెట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అందుకే పట్టాలెక్కేందుకు ఇంత ఆలస్యం అయ్యిందని గతంలోనే చిత్ర యూనిట్‌ తెలిపింది. తాజా సన్నివేశం గురించి ఓ భారీ సెట్‌ని సిద్ధం చేశారు. ఇలాంటి భారీ నుండి అతి భారీ సెట్స్‌ ఈ సినిమాలో చాలా ఉండనున్నాయి. భారీ బడ్జెట్‌తో యూనివర్సల్‌ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం 'సైరా'. 

ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి రెహమాన్‌ మ్యూజిక్‌ అందించాల్సి వుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకుని, ఆ ప్లేస్‌లోకి తమన్‌ వచ్చి చేరారు. వచ్చే ఏడాది ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS