కర్ణాటకలో రంగస్థలం రికార్డ్

మరిన్ని వార్తలు

కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండడం అలాగే అక్కడి కన్నడ ప్రజలకి కూడా తెలుగు సినిమాలు అంటే మక్కువ ఉండడంతో కర్ణాటకలో తెలుగు సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. 

ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలంకి కూడా ఎవరు ఊహించని విధంగా సుమారు రూ 8కోట్లకు పైగా బిజినెస్ చేసింది. విడుదలకి ముందే ఇంత పెద్ద మొత్తంలో కర్ణాటకలో ఒక చిత్రం అమ్ముడవ్వడం చరణ్ కెరీర్ లో ఇదే మొదటిసారి. దీన్నిబట్టి తెలిసిపోతుంది రంగస్థలం చిత్రానికి ఎంతటి క్రేజ్ ఉన్నది అని. 

తెలుగునాట అయితే ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అన్న ఆత్రుతతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. రంగస్థలం ట్రైలర్ విడుదలయ్యాక ఈ ఆసక్తి మరింత పెరిగింది.

మరి ఇంతటి అంచనాలని ఎంతవరకు అందుకుంటుందో అన్నది విడుదల తరువాతనే తెలుస్తుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS