గోపీచంద్ లుక్ లీక్ అయింది

మరిన్ని వార్తలు

హీరో గోపీచంద్ ప్రస్తుతం ఫ్లాపులతో సతమతవుతున్నాడు. ఇక ఇదే సమయంలో ఆయన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి పంతం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

అయితే ఈ సినిమా విషయంలో ఆదిలోనే ఒక ఊహించని షాక్ ఎదురైంది గోపీచంద్ కి.. అదేంటంటే- చిత్ర యూనిట్ వారు ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రేపు ఉదయం అనగా మార్చ్ 22న 10గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రకటనకి విరుద్ధంగా ఉన్నట్టుండి ఈ చిత్రం ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితం బయటకి వచ్చింది.

దీనితో అందరు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవానికి రేపు విడుదల కావాల్సి ఉన్నా ఈరోజే బయటకి రావడానికి కారణం ఫస్ట్ లుక్ లీక్ అవ్వడమే అని తెలుస్తున్నది. 

ఇక విడుదలకి ముందే ఇలా బయటకి వచ్చేయడంతో యూనిట్ వారు కూడా ఈరోజే విడుదల చేసేశారు. ఈ ‘లీక్’ల గోల గోపిని కూడా వదలలేదు...  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS