మెగా పవర్ స్టార్ మాత్రమే కాదు, మెగా ప్రొడ్యూసర్ అని కూడా అన్పించేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్. నిర్మాతగా 'సైరా' పనులు చూసుకుంటూనే, హీరోగా 'రంగస్థలం'పైనా సేమ్ కాన్సన్‌ట్రేషన్ పెట్టాల్సి వస్తోంది ఈ యంగ్ హీరోకి. ఒకేసారి రెండు పెద్ద బాధ్యతలు మోయడం ఆషామాషీ కాదు. అయితే ఇది ఆయనకి అలవాటైపోయింది.
'ధృవ', 'ఖైదీ నెంబర్ 150' సినిమాలు ఏకకాలంలో అలాగే చేశాడు. 'ధృవ'లో చరణ్ హీరోగా నటిస్తే, 'ఖైదీ నెంబర్ 150' సినిమాని నాన్న చిరంజీవి హీరోగా నిర్మించాడు. రెండూ మంచి విజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడూ అదే సీక్వెన్స్. 'రంగస్థలం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంటే, 'సైరా' సినిమా నిర్మాణంలో ఉంది. అప్పుడూ 'ధృవ'పైనా గాసిప్స్ వచ్చాయి, 'ఖైదీ నెంబర్ 150'పైన కూడా గాసిప్స్ తప్పలేదు. ఇప్పుడూ సేమ్ సిట్యుయేషన్. 'సైరా' ఆగిపోయిందట అనే గాసిప్స్ దగ్గర్నుంచి, దర్శకుడు మారాడట, హీరోయిన్ మారిందట అనే గాసిప్స్ వినవస్తున్నాయి.
'రంగస్థలం' రీ షూట్‌పై రూమర్లూ తెలిసినవే. వీటన్నిటికీ చెక్ పెట్టగలిగేది చరణ్ మాత్రమే. అయితే కంప్లీట్ ప్లానింగ్‌తో ఉండే చరణ్ ఈ గాసిప్స్‌ని లైట్ తీసుకుంటున్నాడని సమాచారమ్. ఎంత లైట్ తీసుకున్నా స్పందించకపోతే ఆ గాసిప్స్ ఆయా సినిమాలకి కొంత డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. బాబాయ్ కోసం సంక్రాంతిని త్యాగం చేసిన చరణ్, మార్చ్‌లో రావడం ఖాయమేనా? రాకపోతే మాత్రం ఏప్రిల్ అస్సలు ఖాళీ లేదు. 'సైరా' మాటేంటో! కొంచెం స్పందించవయ్యా చరణూ అని అభిమానులే, తమ అభిమాన హీరోని కోరుతున్నారు.