రామ్ చరణ్ .. శంకర్ ల భారీ సినిమా షూటింగ్ దశలో వుంది. ఇప్పటికే ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. తాజాగా గా వైజాగ్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఆ తరువాత షెడ్యూల్స్ ను హైదరాబాద్ మారేడుమిల్లిలో ప్లాన్ చేశారు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజు భావించారు. అయితే ఈ సినిమా షూటింగు పార్టు ఇంకా చాలానే మిగిలి ఉంది. అందువలన ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయాలనే నిర్ణయానికి దిల్ రాజు వచ్చారని తెలిసింది.
ఈ వాయిదా పక్కా అయినట్లే.. ఎందుకంటె వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపాలని నిర్ణయించారు. దీనిపై తాజాగా ప్రకటన కూడా ఇచ్చారు. శంకర్ సినిమా వాయిదా పడటంతో దిల్ రాజు ఈ నిర్ణయం తీసున్నారని చెప్పవచ్చు. శంకర్ సినిమా అంత త్వరగా పూర్తి కాదు. ఐతే ఈ విషయంలో శంకర్ పై ఒత్తిడి పెంచకుండా దిల్ రాజు తన ప్లాన్స్ తాను చేసుకున్నట్లు తెలిసింది.