రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో చరణ్ రెండు విభిన్న గెటప్పులో కనిపించనున్నాడు. ఉన్నతాధికారిగా ఒక గెటప్‌లో అలాగే పొలిటికల్ నేపధ్యం వున్న మరో పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా వైజాగ్ షూటింగ్ నుండి ఒక లొకేషన్ స్టిల్ లో బయటికి వచ్చింది. 'అభ్యదయం పార్టీ' అనే బ్యానర్ రామ్ చరణ్ ఫోటో కనిపిస్తుంది. చరణ్ గెటప్ కొత్తగా వుంది.
రామ్ చరణ్ కి పొలిటికల్ నేపధ్యం వున్న రంగస్థలం సినిమా బాగా కలిసొచ్చింది. శంకర్ సినిమాలో మాత్రం చరణ్ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడని స్టిల్ చూస్తుంటే అర్ధమౌతుంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ కథలు డీల్ చేయడంలో శంకర్ దిట్ట. ఒకే ఒక్కడు లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఆయన ఖాతాలో వుంది. ఇప్పుడు చరణ్ సినిమా కూడా రాజకీయ నేపధ్యంలో తెరకెక్కడం ఆసక్తికరంగా వుంది.