చరణ్ ను శ్రీహరి అప్పట్లో అలా చూసుకునేవారట

మరిన్ని వార్తలు

'మగధీర' సినిమా విడుదలై ఇప్పటికి 11 ఏళ్ళు అయింది. రామ్ చరణ్ కెరీర్ లో మరపురాని చిత్రంగా నిలిచిన 'మగధీర' స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 11 ఏళ్లు అయిన సందర్భంగా ఈ సినిమా నటీనటులు టెక్నీషియన్స్ తమ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

 

ఇక సినిమాకు సంబంధించిన వారి పాత వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమాలో స్వర్గీయ శ్రీహరి గారు ఒక కీలకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. శ్రీహరి గురించి మాట్లాడుతూ గతంలో ఒక వీడియోలో చరణ్ ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించారు.

 

'మగధీర' యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో చరణ్ విషయంలో శ్రీహరి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారట. ఫైట్ సీక్వెన్సుల చిత్రీకరణకు ముందుగా సేఫ్టీ రోప్స్, ఇతర సేఫ్టీ ఎక్విప్ మెంట్ అన్నీ సరిగా ఉన్నాయా లేదా గమనించేవారట. అయితే స్టంట్ మాస్టర్లు వాటి గురించి జాగ్రత్త తీసుకుంటారు కదా? మీరు ఎందుకు వాటి గురించి ఇంతగా ఆలోచిస్తున్నారని శ్రీహరిని అడిగారట. ఈ సినిమా షూటింగ్ లో నీకు ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అన్నయ్య(చిరంజీవి)కి ఏం జవాబు చెప్పాలి?. నేను ఇక్కడ ఉన్నప్పుడు నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత అని చెప్పారట. ఆ విషయం మాట్లాడుతూ శ్రీహరి గారి అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని చరణ్ చెప్పుకొచ్చారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS