మగధీర లాంటి సూపర్ డూపర్ హిట్ తరవాత.. రామ్ చరణ్ చేసిన సినిమా ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. మగధీర తరవాత చరణ్ ఇమేజ్, గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. చాలామంది దర్శకులు చరణ్ కోసం కథలు సిద్ధం చేశారు. అయితే... ఆ యాక్షన్ ఇమేజ్ నుంచి రొమాంటిక్ హీరోగా మారాలన్న ప్రయత్నంలో.. ఆరెంజ్ చేశాడు. కానీ అది బోల్తా కొట్టింది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాతో నిర్మాత నాగబాబు కూడా బాగా దెబ్బ తిన్నాడు. నాగబాబు అప్పుల పాలైపోతే, చిరంజీవి- పవన్ ఆదుకొన్నారు. అది వేరే సంగతి
.
కాకపోతే.. ఆరెంజ్ సినిమా చరణ్‌కి చాలా ఇష్టం. ఆ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్టే. తనకిష్టమైన ఆల్బమ్ ఇప్పటికీ ఆరెంజే అంటాడు చరణ్. ఈ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రేక్షకులు అర్థం చేసుకోలేదు కానీ, చాలా మంచి పాయింట్ అన్నది వాళ్ల వాదన. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆరెంజ్‌ని రీ రిలీజ్ చేశారు. మగధీర లాంటి సూపర్ హిట్లు ఉండగా, ఫ్లాపు సినిమాని ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారంటూ అంతా ఆశ్చర్యపోయారు. వాళ్లందరికీ ఆరెంజ్ ప్రీ రిలీజ్ వసూళ్లు షాక్ ఇచ్చాయి. కనీ విని ఎరుగని స్థాయిలో స్పందన రావడంతో షోస్ కూడా పెంచారు. అప్పట్లో మాకు అర్థం కాలేదు కానీ, ఈతరానికి బాగా నచ్చింది అంటున్నారు చరణ్ ఫ్యాన్స్.
ఈ సినిమా వసూళ్లతో నాగబాబు కూడా ఖుషీ. ఈ సినిమాని ఇప్పుడు.. హిట్ జాబితాలో చేర్చొచ్చు.. అంటున్నారు నాగబాబు. ఫ్యాన్స్ ది కూడా అదే మాట. పదేళ్ల క్రితం.. అప్పటి ఆలోచనా విధానానికి ఆరెంజ్ చాలా అడ్వాన్డ్స్ కథ. ఈతరానికి మాత్రం బాగా రీచ్ అయ్యిందన్నది వాళ్లమాట. నిజంగానే ఇలాంటి సమయంలో ఆరెంజ్ వచ్చి ఉంటే.. వందల కోట్లు వచ్చి పడిపోయేవేమో.?