కిస్ సీన్‌పై.. కాజ‌ల్ రియాక్ష‌న్‌ మామూలుగా లేదు

By iQlikMovies - December 04, 2018 - 14:25 PM IST

మరిన్ని వార్తలు

'క‌వ‌చం' ప్రెస్ మీట్లో కాజ‌ల్ - ఛోటా మ‌ధ్య సాగిన 'కిస్ సీన్' టాలీవుడ్‌ని షాక్‌కి గురి చేసింది. బ‌హిరంగ వేదిక‌పై ఛోటా ఇలా అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌డం ఆరోజున సంచ‌ల‌న‌మైంది. సోష‌ల్ మీడియాలో చోటాకి వ్య‌తిరేకంగా ట్రోల్ కూడా జ‌రిగింది. కాజ‌ల్ అభిమానుల్ని చోటాని ఓ రేంజులో ఆడుకున్నారు. వాటిపై చోటా కూడా స్పందించాల్సివ‌చ్చింది. త‌ను చాలా క్యాజువ‌ల్ గా ముద్దు పెట్టుకున్నాన‌ని క‌వ‌రింగు ఇచ్చాడు.

ఇప్పుడు ఆ ముద్దు గురించి కాజ‌ల్ స్పందించింది. ఛోటా త‌న కుటుంబ స‌భ్యుడులాంటివాడ‌ని, ఆ రోజు ముద్దు పెట్టిన త‌ర‌వాత‌.. మ‌ళ్లీ త‌న‌తో మాట్లాడాడ‌ని, ఏమైనా త‌ప్పుగా అనుకున్నావా??  అంటూ ఆరా తీశాడ‌ని కాజ‌ల్ అంటోంది. ''ఆ త‌ర‌వాత మేమిద్ద‌రం మాట్లాడుకున్నాం. ఈ విష‌యాన్ని నేనేం సీరియ‌స్‌గా తీసుకోద‌ల‌చుకోలేదు.అదంతా నామీద అభిమాన‌మే అనుకుంటున్నాను.

మీడియాలో మాత్రం ఈ విష‌యంపై బాగా చ‌ర్చ జ‌రిగిన‌ట్టుంది. నేనైతే ఆరోజే లైట్ తీసుకున్నా'' అంటూ ముక్తాయించింది. కాజ‌ల్ క‌థానాయిక గా న‌టించిన `క‌వ‌చం` ఈనెల 7న విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS