రామ్‌ చరణ్‌ మళ్లీ మొదలెట్టేశాడు

మరిన్ని వార్తలు

వేసవి ఎండల కారణంగా మెగా పవర్‌ స్టార్‌ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌ని తాత్కాలికంగా అపేసి, విశ్రాంతి తీసుకున్నారు. సుకుమార్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'రంగస్థలం' అని ఈ మధ్యే ఈ సినిమాకి టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. కాగా ఎండల తాపం చల్లారి, తొలకరి చినుకుల కురుస్తున్న కారణంగా ఈ సినిమా షూటింగ్‌ని మళ్లీ స్టార్ట్‌ చేసింది చిత్ర యూనిట్‌. వర్షాలకి అక్కడి వాతావరణం మరింత ఆహ్లాదంగా మారింది. గోదావరి అందాలు, పల్లెటూరి సొగసులు, వరి చేల వయ్యారాలు ఏమని వర్ణించేది పల్లె ప్రకృతి సోయగాల్ని. అందుకే ఆ అందాల్ని తిలకించేందుకు రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన కూడా షూటింగ్‌కి వెళ్లిందట. అక్కడి వాతావరణానికి మైమరిచిపోతోందట ఉపాసన. ఆ వాతావరణం చాలా బాగుందని పులకించి పోతోందట. ముద్దుగుమ్మ సమంత ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. పల్లెటూరి ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అంతేకాదు ఇదో ప్రయోగాత్మక చిత్రం. పల్లెటూరి కుర్రాడిగా చరణ్‌ పాత్ర అందరి మన్ననలు అందుకుంటుందని అంటున్నారు. గెడ్డం పెంచి డిఫరెంట్‌ లుక్‌లో చరణ్‌ కనిపిస్తున్నాడు. మొత్తానికి చరణ్‌ - ఉపాసనలకి ఈ సినిమా షూటింగ్‌ ఓ తీయని అనుభూతిగా మిగలనుందన్న మాట. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS