బాక్సాఫీసు దగ్గర ఉప్పెన దూకుడు కొనసాగుతోంది. తొలి మూడు రోజుల్లో 30 కోట్లు సాధించిన ఉప్పెన సేఫ్ జోన్‌లో పడిపోయింది. సోమవారం కూడా.. వసూళ్లు నిలకడగా కొనసాగడం మరింత ఉత్సాహాన్ని కలిగించింది. మంగళవారం కూడా వసూళ్లు స్టడీగానే ఉన్నాయి. 5 వరోజు దాదాపుగా 4 కోట్లు వసూలు చేసయగలిగింది. నైజాంలో రూ.1.15 కోట్లు, సీడెడ్ లో 65 లక్షలు వైజాగ్ లో 59 లక్షలు, తూ.గో జిల్లా -39 లక్షలు.. ప.గో జిల్లా- 18లక్షలు..కృష్ణ-19లక్షలు.. గుంటూరు 24లక్షలు.. నెల్లూరు13 లక్షలు వసూలు చేసింది.
ఈవారం నాలుగు కొత్త సినిమాలొస్తున్నాయి. అయినా సరే. ఉప్పెన జోరు కొనసాగే అవకాశం ఉంది. ఈ వీకెండ్ నాటికి మరో 20 కోట్లు సంపాదించే ఛాన్సుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలా చూసినా దాదాపు 50 కోట్ల (షేర్) వసూలు చేస్తుంది. మరోవైపు... డిజిటల్, శాటిలైట్ రేట్స్ రూపంలో భారీగా డబ్బులొచ్చాయి. ఎలా చూసినా.. నిర్మాతలకు ఇది పైసా వసూల్ సినిమానే.