రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. దాదాపు 200 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అయితే... ఈ సినిమా ప్రకటన వచ్చిన తరవాత... శంకర్ వివాదాల్లో ఇరుక్కున్నారు. `భారతీయుడు 2` పూర్తయ్యేంత వరకూ శంకర్ ఏ సినిమా మొదలెట్టకుండా చూడాలని... లైకా ప్రొడక్షన్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే న్యాయ స్థానం కూడా.. ఈ విషయాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించింది. దాంతో అసలు చరణ్ సినిమా పట్టాలెక్కుతుందా? లేదా? అనే అనుమానాలు నెలకున్నాయి.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చరణ్ సినిమాకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. జూన్ తొలి వారంలో ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు రెడీ అయ్యార్ట. `ఆర్.ఆర్.ఆర్` తరవాత సెట్స్‌పైకి వెళ్లబోయే చరణ్ సినిమా ఇదే అని.. ఈ విషయంలో ఎలాంటి డౌటూ అక్కర్లేదని మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. సో... చరణ్ - శంకర్ కాంబినేషన్‌కి ఢోకాలేనట్టే.