`ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి` - ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. ఎన్టీఆర్ జయంతి.. వర్థంతి వస్తే... బాలయ్య ఈ డిమాండ్ ని వినిపిస్తూనే ఉంటారు. అయితే.. ఈ మాట ఇప్పుడు చిరంజీవి నోటి నుంచి వచ్చింది. భూపేన్ హజారికాకి మరణానంతరం భారతరత్న ఇచ్చారని, ఎన్టీఆర్ కీ అదే గౌరవం ఇవ్వాలని చిరు తన ట్వీట్ లో కోరారు. ఎన్టీఆర్‌కి భారత రత్న ఇస్తే.. తెలుగువాళ్లంతా గర్వించే సందర్భం అవుతుందని, ఎన్టీఆర్ నూరవ జన్మదినం సందర్భంగా ఈ గౌరవం దక్కితే.. బాగుంటుందని ట్వీట్ చేశారు.
చిరు ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ని చిరు కాస్త గట్టిగా వినిపించడం హర్షణీయమని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ట్వీట్ తో చిరు తమ మనసుల్ని గెలుచుకున్నాడని... నందమూరి ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. చిరులా మిగిలిన హీరోలూ.. ఈ విషయంపై కాస్త నోరు మెదిపితే బాగుంటుంది.
ఎన్టీఆర్ నూరవ జన్మదినానికి ఇంకా యేడాది సమయం ఉంది.. ఈ లోగా తెలుగు చిత్రసీమ అంతా ఏకమై.. ఒక్క తాటిపై వచ్చి, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, కేంద్రాన్ని కదిలించగలిగితే - తప్పకుండా ఎన్టీఆర్ ని భారతరత్న గా చూడొచ్చు.