గేమ్ చేంజర్ మూవీ ఆగిపోయిందా?

మరిన్ని వార్తలు

RRR మూవీ తరువాత రామ్ చరణ్ నుంచి ఒక్కమూవీ కూడా రాలేదు. శంకర్ డైరక్షన్లో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నా ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్స్ ఏం రావటం లేదు. RRR తరవాత ఎన్టీఆర్ కొరటాల శివతో దేవర 2 పార్ట్స్ చేస్తున్నాడు. వార్ 2 తో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. కానీ చెర్రీ ఓన్లీ గేమ్ చెంజర్ మూవీతోనే కుస్తీ పడుతున్నాడు. ప్రభాస్ , మహేష్ లాంటి వారు వరుసగా సినిమాలు చేస్తుంటే చెర్రీ వెనకపడిపోతున్నాడని ఫాన్స్ కంగారు పడుతున్నారు.


గేమ్ చెంజర్ నిర్మాత దిల్ రాజు మాత్రం అప్పుడప్పుడు ఈ చిత్రానికి సంబంధించి పలు విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. హీరో , డైరక్టర్ లు ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఏ విధంగా స్పందించలేదు. ఈ క్రమంలోనే చెర్రీ ఫాన్స్ కి మింగుడు పడని వార్త ఒకటి బయటికి వచ్చింది.   


రామ్ చరణ్ కి, శంకర్ కి మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో చరణ్, శంకర్ తో కాస్త సీరియస్ గా మాట్లాడినట్లు, శంకర్ కూడా రామ్ చరణ్ కి అంతే సీరియస్ గా సమాధానం చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్ శంకర్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2 షూటింగ్ కంప్లీట్ అవటంతో, ఇక గేమ్ చేంజర్ మొదలవుతుందని, అంతా అనుకుంటున్న నేపథ్యంలో రామ్ చరణ్ , శంకర్ కి మధ్య విభేదాలు అని తెలిసి, అసలు ఈ సినిమా షూటింగ్ నడుస్తుందా లేదా అనే విషయం పై క్లారిటీ రావడంలేదని అభిమానులు వాపోతున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు గూర్చి కూడా ఎలాంటి అప్డేట్ లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS