చరణ్‌ 'సిక్స్‌ ప్యాక్‌' లుక్‌ ఎప్పుడంటే!

మరిన్ని వార్తలు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌ లుక్‌తో కన్పించబోతున్నాడు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమా కోసమే ఈ ప్రయత్నం. ఆ తర్వాత వెంటనే అదే లుక్‌ని కొనసాగిస్తూ, దానికి ఇంకాస్త 'రఫ్‌నెస్‌' ఆపాదిస్తూ, మరో డిఫరెంట్‌ ప్యాటర్న్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కనిపించబోతున్నాడు. 

అది రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే సినిమా కోసం. మరి, రాజమౌళి దర్శకత్వంలో రూపొందే ఆ సినిమా కోసం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ లుక్‌ ఎలా వుండబోతోంది? మెగా ఫ్యాన్స్‌ ఉత్కంఠకి త్వరలో తెరపడనుందట. చరణ్‌కి ఎప్పటినుంచో సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ వుంది. అది తొలి సినిమా 'చిరుత'కే చరణ్‌ సొంతమైంది. అప్పటినుంచీ, దాన్ని అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు చరణ్‌. ఇటీవల వచ్చిన 'ధృవ' సినిమాలో చరణ్‌ కండల ప్రదర్శనని ఎలా మర్చిపోగలం? 

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇచ్చిన సూచనలతో తన సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ని అలా జాగ్రత్తగా మెయిన్‌టెయిన్‌ చేస్తున్నాడు మెగా పవర్‌ స్టార్‌. రాజమౌళి సినిమా కోసం జస్ట్‌ ఓ వారం రోజులు ఎక్సర్‌సైజ్‌లు చేస్తే సరిపోతుందట రామ్‌చరణ్‌కి. యంగ్‌ టైగర్‌ సిక్స్‌ ప్యాక్‌ లుక్‌కి సంబంధించి టీజర్స్‌ అనేలా కొన్ని ఫొటోలు బయటకొస్తున్న దరిమిలా, మెగా ఫ్యాన్స్‌ కూడా చరణ్‌ నుంచి అలాంటి స్టిల్స్‌ని ఆశించడం తప్పేమీ కాదు. 

సో, చరణ్‌ - ఎన్టీఆర్‌ కాంబోలో ఓ బీభత్సమైన లుక్‌ని త్వరలోనే దర్శకుడు రాజమౌళి 'ప్రెజెంట్‌' చేసి తీరాల్సిందే. ఆ రోజెంతో దూరంలో లేదు. అతి త్వరలో ఆ ముచ్చటని రాజమౌళి తీర్చేయబోతున్నాడని సమాచారమ్‌.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS