చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి ఎంటరైన రామ్ చరణ్ సెకండ్ మూవీతోనే తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని, తండ్రిని మించిన తనయుడు అయ్యాడు. చిరంజీవికి ఇన్ని సినిమాల ద్వారా వచ్చిన పేరు ప్రఖ్యాతలు, చెర్రీకి అతి తక్కువ టైం లోనే వచ్చి గ్లోబల్ స్టార్ అయిపోయాడు. RRR మూవీ లో చెర్రీ నట విశ్వరూపం చూశారంతా. ఈ మూవీ తరువాత పలువురు స్టార్ డైరక్టర్స్ ఈ మెగా వారసుడితో వర్క్ చేయటానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రజంట్ సెన్షేషనల్ డైరక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. నెక్స్ట్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబుతో ఒక మూవీ కమిట్ అయ్యాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఇవి కాకుండా లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్లతో చర్చలు జరిపాడు. వీటిలో కొన్ని కాంబినేషన్‌లు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని టాక్.
వరస లైనప్ ప్లాన్ చేసిన చెర్రీ, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. ఈ ప్రాజెక్ట్ కింగ్ సుహెల్‌దేవ్ బయోపిక్ అని తెలుస్తోంది. కింగ్ సుహేల్ దేవ్ గా చరణ్ నటిస్తున్నాడని తెలియటంతో ఇప్పుడీ న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఈ మూవీని హిందీలో, దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారట. ఇది 'బహ్రైచ్ యుద్ధం' నేపథ్యంతో రూపొందనున్నట్లు, బాలీవుడ్‌లోనే ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్నట్లు టాక్. ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కనుంది.
చెర్రీ లాంటి గ్లోబల్ స్టార్ ఒక బయోపిక్ లో నటిస్తున్నాడంటే, మెగా ఫాన్స్ లో ఆసక్తి నెలకొంది. చరణ్ చేస్తున్న బయోపిక్ ఎవరిది, సుహెల్‌దేవ్ ఎవరు అని అంతా తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రజంట్ సుహేల్ దేవ్ ట్రెండింగ్ అవుతున్నాడు. ఆయన 11వ శతాబ్దంలో శ్రావస్తి రాజ్యాన్ని పరిపాలించిన రాజు. గజ్నవిద్ దళాలు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు సుహెల్ తన సైన్యంతో వాళ్లను మట్టికరిపించి దేశాన్ని కాపాడాడు. అందుకే ఆయనను 'ఇండియాను కాపాడిన రాజు' అంటారు. అలాంటి వీర యోధుడి పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. అదీ సంజయ్ లీలా బన్సాలి డైరక్షన్ లో అంటే ఈ మూవీ వేరే లెవల్ లో ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.