RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, నెక్స్ట్ దేవర సినిమాతో రానున్నాడు. ఈ మూవీని కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా వస్తోంది. దసరాకి మొదటి పార్ట్ రానుంది. నెక్స్ట్ వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాల తర్వాత కేజిఎఫ్ , సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా కమిట్ అయ్యాడు. చాలా మంది డైరక్టర్స్ తారక్ కోసం, తనతో వర్క్ చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ క్రంమలోనే ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇన్ని సినిమాలు చేసినా, ఎన్టీఆర్ కి ఒక డ్రీమ్ రోల్ ఉందట. ఆ డ్రీమ్ రోల్ పోషించే అవకాశం ఎప్పటికి నెరవేరుతుందో అని ఆశగా ఉన్నాడట. అదేంటి అంటే ఎన్టీఆర్ కి ఎప్పటినుంచో శ్రీకృష్ణుడి పాత్రను పోషించాలని కోరిక. టాలీవుడ్ లో కృష్ణుడైనా, రాముడైనా, కర్ణుడైనా, దుర్యోధనుడైనా పురాణ పాత్రలు ఏమైనా సీనియర్ ఎన్టీఆర్ రూపమే అందరికి గుర్తుకొస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ళ తాత లాగే కృష్ణుడి పాత్రలో నటించి మెప్పించాలని అనుకుంటున్నారట.
ఈ డ్రీమ్ ఇప్పటిది కాదు, చిన్నప్పటినుంచి ఉందని, అవకాశం వస్తే కృష్ణుడి పాత్రలో మెరుస్తానని, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు ఎన్టీఆర్. ఇది విన్న నందమూరి ఫాన్స్ తాతకు తగ్గ మనవడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాత వారసత్వాన్ని మనవడు కంటిన్యూ చేస్తూ, ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి .