మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డబుల్ హ్యాపీగా ఉన్నాడు. ఒకవైపు హీరోగా ధృవ మరోవైపు నిర్మాతగా ఖైదీ నెం 150ల విజయాలతో దూసుకుపోతున్నాడు.
ఈ కిక్ లోనే, తన కొత్త సినిమాని శ్రీకారం చుట్టబోతున్నాడు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం జనవరి 30న పూజ కార్యక్రమాలు నిర్వహించి ఫిబ్రవరి మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. ఈ షూటింగ్ ఎక్కువగా గోదావరి జిల్లాల్లోనే జరగనుందని సమాచారం.
మరోవైపు అనుపమ పరమేశ్వరన్ రాకతో ఈ సినిమాకి కొత్త గ్లామర్ వచ్చిందని అభిమానులు సంబరపడుతున్నారు. ఇక డైరెక్టర్ సుకుమార్ విషయానికి వస్తే, తన గత చిత్రాల మాదిరిగానీ ఇది కూడా డిఫరెంట్ గా ఉండబోతుంది అనేది ఫిలిం నగర్ వర్గాల టాక్.