పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. వివిధ అంశాలపై తన మనసులోని భావాలు అభిమానులతో పంచుకుంటున్నాడు. అలాగే నిన్న కూడా జల్లికట్టు, కోడిపందాలు బ్యాన్ గురించి ట్వీట్లు చేశాడు. వాటి పై ఉన్న బ్యాన్ తొలగించాలని తన పార్టీ జనసేన తరపున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాడు.
ఇదిలాఉంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పవన్ వాదనతో ఏకిభవించలేదు అలానే తను మాత్రం జల్లికట్టు పైన నిషేదం కొనసాగాల్సిందే అని స్పష్టం చేశాడు. పవన్ ని రియల్ లైఫ్ హీరోగా కీర్తించే రామ్ గోపాల్ వర్మ అలా విభేదించే సరికి అందరూ ఒక్కింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
అటు తమిళనాడులో మాత్రం జల్లికట్టు పై జరుగుతున్న నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.చూద్దాం.. పవన్ ఫ్యాన్స్ రాము ట్వీట్లపై ఎలా స్పందిస్తారో ?