రామ్‌చరణ్‌ ఇన్‌స్టాలో ఫస్ట్‌ పోస్ట్‌ వచ్చేసిందోచ్‌!

మరిన్ని వార్తలు

'కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు.. నా ఫస్ట్‌ పోస్ట్‌ నీకు అంకితం ఇస్తున్నాను.. లవ్‌ యూ అమ్మా.. మామ్స్‌ బోయ్‌.. ఫర్‌ఎవర్‌..' అంటూ తల్లి పట్ల తనుకున్న ప్రేమను చాటుకుంటూ రామ్‌చరణ్‌ తన ఇన్‌ స్టాలో తొలి పోస్ట్‌ పెట్టి అందరినీ మెస్మరైజ్‌ చేశాడు. చిన్నతనంలో అమ్మ ఒడిలో సేద తీరుతున్న ఫోటోనీ, ప్రస్తుతం అమ్మ ఒడిలో పడుకుని నవ్వులు చిందిస్తున్న ఫోటోనీ జత చేసి, ఈ పోస్ట్‌ చేశాడు రామ్‌చరణ్‌.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Somethings never change !! Dedicating my first post to u. Love u Amma. ❤#mamasboy #forever.

A post shared by Ram Charan (@alwaysramcharan) on

 

పోస్ట్‌ చేసిన అరగంటలోనే లక్షల్లో వ్యూస్‌ వచ్చేశాయి ఈ పిక్స్‌కి. దాదాపు 2000 మందికి పైగా స్వీట్‌ కామెంట్స్‌తో చరణ్‌ అమ్మ ప్రేమకు ప్రశంసలు గుప్పిస్తున్నారు. అయితే, చరణ్‌ తన ఇన్‌స్టాలో ఫస్ట్‌ పోస్ట్‌ 'సైరా' అప్‌డేట్‌ ఇస్తాడని ఫ్యాన్స్‌ ఆశించారు. కానీ, అమ్మపై తనకున్న ప్రేమతో తొలి పోస్ట్‌ పెట్టి, అందర్నీ ప్రేమ ఊయలలో ఓలలాడించేశాడు. ప్రస్తుతం చరణ్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నాన్న చిరంజీవి 151 వ సినిమాకి నిర్మాతగా 'సైరా' పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల పర్యవేక్షణలోనూ బిజీగా ఉన్నాడు చరణ్‌. ఈ సినిమాని అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS