దాన్ని 'లిప్‌కిస్‌' అనొద్దంటోన్న డైరెక్టర్‌!

మరిన్ని వార్తలు

లిప్‌కిస్‌ అంటే రెండు జతల పెదాలు అంటే నాలుగు పెదాలు కలిస్తే వచ్చే ముద్దే అని అందరికీ తెలిసిందే. అమ్మాయి, అబ్బాయి డీప్‌ లవ్‌లో ఉన్నప్పుడు వారు ఎక్స్‌ప్రెస్‌ చేసుకునే భావమే ఈ లిప్‌కిస్‌. ఇప్పుడు ఈ ఘట్టం లేకుండా సినిమాలే లేవని చెప్పాలి. అయితే, ఈ రోజు విడుదల కానున్న 'దొరసాని' సినిమాలోని లిప్‌కిస్‌ కోసం డైరెక్టర్‌ మహేంద్ర, ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇస్తూ, అది కథకి ఎంతో అవసరం కావడంతో చేసిన సీన్‌. ఇద్దరు ప్రేమికులు తమ మధ్య స్వచ్ఛమైన ప్రేమని ఒకరితో ఒకరు ఎక్స్‌ప్రెస్‌ చేసుకునే సిట్యువేషన్‌ని రొమాంటిక్‌ ఫీల్‌తో చెప్పగలగడం ఆ ఒక్క సీన్‌తోనే సాధ్యపడుతుంది.

 

అది లిప్‌కిస్‌ కాదు, మనసుని హత్తుకునే ఓ రొమాంటిక్‌ ఫీల్‌. ఆ ఫీలింగే ఈ రోజుల్లో ఆడియన్స్‌కి రొమాంటిక్‌ కనెక్ట్‌ అవుతుంది. అందుకే 'దొరసాని'లో ఆ సీన్‌ పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. అయితే, అలాంటి సీన్స్‌ సినిమాలో ఇంకా ఉన్నాయా.? అంటే అది సినిమా చూస్తేనే తెలుస్తుందని మాట దాటేశారు డైరెక్టర్‌ మహేంద్ర. ఇక ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానున్న 'దొరసాని' అంచనాల్ని క్రియేట్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే.

 

దొరసానిగా శివాత్మిక లుక్స్‌ ఎగ్జాక్ట్‌గా సెట్‌ అయ్యాయనీ, నిజంగానే శివాత్మికలో ఓ దొరసాని ఉందనీ ఆయన తెలిపారు. ఆనంద్‌ దేవరకొండ, శివాత్మికలకు ఈ సినిమాతో మంచి గుర్తింపు రావడం ఖాయమని నమ్మకంగా చెబుతున్నారు డైరెక్టర్‌ కె.వి.ఆర్‌. మహేంద్ర. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రం ఎలాంటి టాక్‌ సొంతం చేసుకుందో తెలియాలంటే సాయంత్రం వరకూ వేచి చూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS