రామ్ చరణ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో ద్వారా తెలియజేశారు. ``ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాను. కరోనా లక్షణాలు ఏవి లేవు. గత కొద్ది రోజులుగా నన్ను కలిసి వాళ్లు పరీక్షలు చేయించుకోండి. త్వరలోనే కోలుకొని శక్తివంతంగా మీ ముందుకు వస్తాను`` అంటూ ట్వీట్ చేశాడు.
రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజు అనే పాత్రలో కనిపించనున్నారు. మరి కొద్ది రోజులలో చిత్ర షూటింగ్ పూర్తవుతుందని అనుకునే క్రమంలో రామ్ చరణ్‌కు కరోనా సోకడం చిత్ర బృందాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. మరోవైపు ఇటీవల ఆయన `ఆచార్య` సెట్లోకి అడుగుపెట్టారు. సెట్లో చాలామందిని కలిశారు. క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొన్నారు. ఆ వేడుకల్లో... మెగా హీరోలంతా మెరిశారు. ఇప్పుడు వాళ్లంతా.. కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే.
చరణ్‌కి కరోనా.. టెన్షన్లో ఆచార్య #RamCharan
Request all that have been around me in the past couple of days to get tested.
— Ram Charan (@AlwaysRamCharan) December 29, 2020
More updates on my recovery soon. pic.twitter.com/lkZ86Z8lTF