వీకెండ్ అద‌ర‌గొట్టిన సాయితేజ్‌!

మరిన్ని వార్తలు

దాదాపు 9 నెల‌ల సుదీర్ఘ విరామం త‌ర‌వాత థియేట‌ర్లు తెర‌చుకున్నాయి. థియేట‌ర్ ముందు కొత్త సినిమా పోస్ట‌ర్లూ, క‌టౌట్లూ క‌నిపించాయి. ఇక స‌గ‌టు సినీ అభిమాని ఆగుతాడా? `సినిమా చూద్దాం రండి..` అంటూ క్యూలు క‌ట్టారు. క‌రోనా భ‌యాల్ని వీడి... థియేటర్లోకి అడుగుపెట్టారు. దాంతో `సోలో బ‌తుకే సో బెట‌ర్‌` సినిమాకి మంచి ఓపెనింగ్స్ ల‌భించాయి. తొలి రోజే ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వ‌చ్చినా... ప్రేక్ష‌కుల స్పంద‌న త‌గ్గ‌లేదు. దాంతో ఈ వీకెండ్ బాక్సాఫీసు ద‌గ్గ‌ర కాసుల వ‌ర్షం కురిసింది. తొలి మూడు రోజుల్లో 2.8 కోట్ల షేర్ సంపాదించింది. 50 శాతం ఆక్యుపెన్సీలోనూ.. దాదాపు 3 కోట్లు తెచ్చుకుందంటే... విశేష‌మే.

 

 

3 రోజుల వ‌సూళ్ల వివ‌రాలివీ...

 

నైజాం - 0.98 cr

సీడెడ్ - 0.54 cr

UA - 0.36 cr

గుంటూరు - 0.28 cr

ఈస్ట్ - 0.21 cr

కృష్ణ - 0.16 cr

వెస్ట్ - 0.13 cr

నెల్లూరు - 0.13 cr

 

Total AP/TS - 2.79 Cr

 

Total 3 days AP/TS gross - 10.80 Cr

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS