'ఫిట్నెస్ ఛాలెంజ్' ఈ మధ్య దీని గురించి వినే ఉంటారు. ఎందుకంటే సోషల్ మీడియా లో ఇది అంతలా వైరల్ అయింది మరి. 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ ' అనే పేరుతో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ దీనికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు దీనిని అనుసరిస్తూ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు.
టాలీవుడ్ లో కూడా ప్రస్తుతం ఈ ఛాలెంజ్ కొనసాగుతున్నది. ఈ మధ్యనే కంప్లీట్ ఆక్టర్ మోహన్ లాల్ చేసిన ఛాలెంజ్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వీకరించి ఒక వర్క్ అవుట్ వీడియో పెట్టాడు. దానికి కొనసాగింపుగా నందమూరి కళ్యాణ్ రామ్, మహేష్ బాబు, రామ్ చరణ్, రాజమౌళి మరియు కొరటాల శివ ని ఛాలెంజ్ చేసాడు.
ఇక ఛాలెంజ్ లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఛాలెంజ్ ని తీసుకుని... "హే ఎన్టీఆర్ బ్రదర్ ఐ ఆక్సిప్టెడ్ యువర్ ఛాలెంజ్ అని బాక్సింగ్ చేస్తున్న వీడియో ను తన ఫేస్బుక్ పేజీ లో పోస్ట్ చేసాడు". దీనికి కొనసాగింపుగా దర్శకుడు సుకుమార్, తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్, ఫ్యాషన్ డిజైనర్ అబూ జానీ, సందీప్ ఘోస్లా, అత్తగారు శోభన కామినేని, తమ్ముడు వరుణ్ తేజ్ మరియు తన తండ్రి మెగాస్టార్ ని ఛాలెంజ్ చేసారు రామ్ చరణ్.
మరి ఈ ఛాలెంజ్ ని ఎంతమంది స్వీకరిస్తారో చూడాలి