దర్శకుడు క్రిష్ తన భార్యకి విడాకులు ఇస్తున్నట్టుగా తెలియడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. అ షాక్ నుండి తేరుకోకముందే మరొక టాలీవుడ్ జంట గురించిన పుకార్లు మొదలయ్యాయి.
ఆ పుకార్ల ప్రకారం, మంచు మనోజ్ ఆయన భార్య ప్రణతి గతకొంత కాలంగా ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారు అని త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారట. దీనితో మంచు మనోజ్ తన భార్య నుండి విడిపోవడానికి కారణాలు ఏమి ఉంటుంది అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది.
ఇక ఈ పుకార్లకి ఫుల్ స్టాప్ పెడుతూ మనోజ్ తన ట్విట్టర్ లో తన భార్య, స్నేహితులతో కలిసి దిగిన ఒక ఫోటోని పెట్టాడు. దీనితో ఇవి ఒట్టి పుకార్లు మాత్రమేనని క్లారిటీ వచ్చేసింది. అయితే ఇటువంటి పుకార్లు ఎందుకు వస్తున్నాయో మాత్రం తెలియట్లేదు.
ఏదేమైనా.. మంచు మనోజ్ కి ఈమధ్య కెరీర్ లోను ఇటు వ్యక్తిగత జీవితంలో అడ్డంకులు వస్తున్నాయి.