మెగాస్టార్ చిరకాల కోరిక నిజం చేయబోతున్న రామ్ చరణ్..!

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాలి. ఇప్పటికే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రోల్స్ రాయ్స్ కారుని బహుమతి ఇవ్వడం, చిరు 150 & 151 చిత్రాలని నిర్మించడం వంటివాటితో చెర్రీ తన ప్రేమని వ్యక్తపరుస్తూనే ఉన్నాడు.

ఇక ఇప్పుడు మాత్రం చరణ్ తన తండ్రి కలని పూర్తి చేయబోతున్నాడట. అదేమనగా- తనకి ఈ పేరు ప్రతిష్ట ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమకి ఏదైనా తిరిగి ఇవ్వాలని అందుకోసమే ఒక సినీ స్టూడియోని నిర్మించాలని చిరంజీవి చాలారోజుల నుండి ప్రయత్నిస్తున్నారట.

అది తెలిసిన రామ్ చరణ్, తన తండ్రి కన్నా కలని ఇప్పుడు నెరవేర్చే పనిలో పడ్డాడట. హైదరాబాద్ లో కోకాపేట్ సమీపంలో వారికి వారి కుటుంబానికి చెందిన సుమారు 20 ఎకరాల స్థలంలో సినీ స్టూడియోని నిర్మించనున్నారట. ఈ నిర్మాణానికి సంబంధించి పూర్తి బాధ్యతని తన భుజాలకేత్తుకున్నట్టుగా సమాచారం.

ప్రస్తుతం ఆ స్థలంలోనే సైరా షూటింగ్ జరుగుతుండడం విశేషం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS