పవన్ కళ్యాణ్ అభిమానులతో వివాదం కారణంగా రాత్రికి రాత్రే ప్రముఖుడిగా మారిన సినీ క్రిటిక్ మహేష్ కత్తి తాజాగా సంచలన ప్రకటన చేశాడు. ఇప్పుడు ఆ ప్రకటన పలురకాలైన చర్చలకి దారితీస్తున్నది.
ఇంతకి ఆ ప్రకటన ఏంటంటే- ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాను రానున్నట్టు, త్వరలోనే కాంగ్రెస్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాను, అన్నిటికి మించి తన స్వస్థలం అయిన చిత్తూరు ఎంపీ గా పోటీ చేయాలనీ ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టాడు.
అయితే ఈ అంశానికి ఒక తుది రూపు రాబోయే రెండు నెలల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని స్పష్టంచేశాడు. ఇక మహేష్ కత్తి చేసిన ఈ ప్రకటనతో ఆయనని వ్యతిరేకించేవారు ఈ పరిణామం ఊహించినదే అని అంటుండగా ఆయన మద్దతుదారులు మాత్రం ఈ రాజకీయ ఎంట్రీని స్వాగతిస్తున్నారు.
మొత్తానికి సినీ క్రిటిక్ నుండి పార్లమెంట్ కి వెళ్ళాలనే తన ఆలోచనని బయటపెట్టేశాడు.