సుకుమార్ - చెర్రీ కాంబోలో శ్రద్దా కపూర్

మరిన్ని వార్తలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో మూడేళ్లు లాక్ అయిపోవటంతో ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ప్రస్తుతం RC16 షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. నెక్స్ట్ పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ తో ఒక మూవీ కమిట్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప 2 తో సుకుమార్ చేసే మూవీ చెర్రీతోనే. అందుకే RC16 దసరా బరిలో నిలిపేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ లోగా సుక్కు స్క్రిప్ట్ కంప్లీట్ చేసి, నటీ నటుల ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

తాజాగా 'ఆర్సీ 17' మూవీలో హీరోయిన్ ని ఫిక్స్ చేశారట సుకుమార్. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా సినిమా కావటంతో చెర్రీ కోసం బాలీవుడ్ హీరోయిన్ ని అప్రోచ్ అయ్యారట సుకుమార్. బాలీవుడ్ లో వరుస ఛాన్స్ లతో ఫుల్ ఫామ్ లో ఉన్న హిట్ బ్యూటీ శ్రద్దా కపూర్ చెర్రీకి జోడీ అయితే బాగుంటుంది అని ఆమెని సంప్రదించినట్లు తెలుస్తోంది.

శ్రద్దా కపూర్ తెలుగు హీరోల్లో ఒక్క ప్రభాస్ తోనే యాక్ట్ చేసింది. ఇప్పుడు చెర్రీకి జోడీగా నటిస్తే ఆ క్రేజే వేరు. చెర్రీ, శ్రద్దా కపూర్ జోడి పర్ఫెక్ట్ గా ఉంటుంది అని మెగా ఫాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఇంతకీ శ్రద్దా ఏం చేస్తుందో చూడాలి. అసలు పుష్ప 2 లో ఐటెం సాంగ్ కోసం కూడా సుకుమార్ శ్రద్దా కపూర్ ని అప్రోచ్ అయ్యారు. కానీ అమ్మడు నో చెప్పింది. ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్, పైగా పుష్ప డైరెక్టర్, చెర్రీ హీరో కావటంతో నో చెప్పే ఛాన్స్ ఉండదు. ఈ మధ్య చెర్రీ వరుసగా బాలీవుడ్ హీరోయిన్స్ తోనే నటిస్తున్నాడు. RRR లో అలియా, గేమ్ చేంజర్ లో కియారా, RC16 లో జాన్వీ, అన్నీ కుదిరితే RC17 లో శ్రద్ధా కపూర్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS