కొన్ని క్రేజీ కాంబినేషన్స్ గురించి అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గాలు, మీడియా, ట్రేడ్ సర్కిల్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. క్రేజీ కాంబినేషన్ అంటూ కథనాలు వెలువడిన దగ్గర్నుంచీ -సినిమా ఎప్పుడొస్తుందా? అని ప్రేక్షకుడు ఎదురు చూస్తుంటాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలాంటి ఆసక్తిరేపే కాంబినేషన్స్ రాబోతున్నాయి. ఈ కాంబినేషన్స్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.
త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్, బన్నీ, మహేష్ తోనే ఎక్కువ సినిమాలు చేశారు. బోయపాటి కూడా బాలయ్య, బన్నీ తోనే వరస సినిమాలు చేస్తున్నాడు. మధ్యలో రామ్ తో ఒక మూవీ చేసిన బోయపాటి మళ్ళీ ఇప్పుడు బాలయ్యతో ఇంకో మూవీ కి రెడీగా ఉన్నారు. కానీ బోయపాటి ప్రభాస్ తో ఒక సినిమా చేయనున్నారని, త్రివిక్రమ్ రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ పట్టాలెక్కించే పనిలో ఉన్నారని టాక్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. గత ఏడాది లో ఆదిపురుష్, సలార్ తో ఆడియన్స్ ని అలరించిన ప్రభాస్ నెక్స్ట్ కల్కి, రాజా సాబ్ , సలార్ 2 లతో బిజీ షెడ్యూల్ లో ఉన్నాడు. నెక్స్ట్ సందీప్ వంగ తో స్పిరిట్, హను రాఘవ పూడితో ఒక మూవీ కమిట్ అయ్యాడు. ఇన్ని ప్రాజెక్ట్ లు ఉండగా ఇప్పుడు బోయపాటి కూడా ప్రభాస్ కోసం భారీ యాక్షన్ ప్లాన్ చేసారని, దీనికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ కాంబో కోసం ఆడియన్స్ ఈగర్లీ వెయిటింగ్.
త్రివిక్రమ్ మహేష్ తో గుంటూరు కారం తరవాత అల్లు అర్జున్ తో ఒక సినిమా అనౌన్స్ చేశారు. కానీ గుంటూరుకారం తో అపవాదు మూటగట్టుకున్న త్రివిక్రమ్ ని బన్నీ పక్కన పెట్టాడని, అందుకే ఇప్పుడు మాటల మాంత్రికుడు చెర్రీ వైపు చూస్తున్నాడని టాక్. దానికి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ స్క్రిప్ట్ పనులను త్రివిక్రమ్ పూర్తి చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. త్రివిక్రమ్ - రామ్ చరణ్ కాంబినేషన్ కోసం ఎప్పటినుంచో మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అది ఇప్పటికీ వర్కౌట్ అవుతున్నందుకు వారు సంతోషిస్తున్నారు.