శంక‌ర్ త‌ర‌వాత‌... చ‌ర‌ణ్ ప్లానింగేమిటి?

By Gowthami - August 04, 2021 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

`ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత శంక‌ర్ తో జ‌ట్టుక‌ట్ట‌బోతున్నాడు రామ్ చ‌ర‌ణ్‌. ఈ నెల‌లోనే ఈసినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. చ‌ర‌ణ్ - కైరా అద్వాణీల‌పై ఓ పాట తెర‌కెక్కించ‌నున్నారు. 2022 చివ‌ర్లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని స‌మాచారం. అయితే ఆ త‌ర‌వాత చ‌ర‌ణ్ సినిమా ఏమిటి? త‌న కెరీర్ విష‌యంలో ఎలాంటి ప్లానింగ్ లో ఉన్నాడు? అనే చ‌ర్చ జ‌రుగుతోంది చ‌ర‌ణ్ అభిమానుల్లో. నిజానికి బ‌డా హీరోలంతా త‌మ కెరీర్ ప‌ట్ల‌... పక్కా ప్లానింగ్ లో ఉన్నారు. ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, మ‌హేష్‌, బ‌న్నీ... వీళ్లంతా రెండు మూడేళ్ల‌కు స‌రిప‌డా ప్రాజెక్టుల్ని చేతిలో ఉంచుకున్నారు.

 

క‌థ‌ల్ని ఓకే చేసుకున్నారు. కానీ చ‌ర‌ణ్ మాత్రం అంత స్పీడుగా ఉండ‌డం లేదు. శంక‌ర్ సినిమా త‌ర‌వాత ఎవ‌రితో చేయాలి? ఏ జోన‌ర్ లో చేయాలి? అనే విష‌యంలో తానింకా ఓ క్లారిటీకి రాలేద‌ని స‌మాచారం. అయితే త‌న ద‌గ్గ‌ర కూడా కొన్ని ఆప్ష‌న్లు ఉన్నాయి. సాహో ద‌ర్శ‌కుడు సుజిత్ తో సినిమా చేయాల‌న్న‌ది చ‌ర‌ణ్ ప్లాన్‌. సాహో త‌రవాత సుజిత్ ఓ క‌థ తీసుకొచ్చి చ‌ర‌ణ్ కి వినిపించాడు. అయితే అప్ప‌ట్లో `లూసీఫ‌ర్‌` రీమేక్ ని సుజిత్ కి అప్ప‌గించాల‌ని చ‌ర‌ణ్ భావించాడు. అందుకే సుజిత్ క‌థ‌ని ప‌క్క‌న పెట్టారు.

 

అయితే ఆ లూసీఫ‌ర్ రీమేక్ చేతులు మారి... మోహ‌న్ రాజా ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. అలా సుజిత్ చేతిలోంచి మెగా ప్రాజెక్ట్ జారిపోయింది. అందుకే ఇప్పుడు సుజిత్ చెప్పిన క‌థ‌ని ప‌ట్టాలెక్కించాల‌ని చ‌ర‌ణ్ భావిస్తున్నాడ‌ట‌. అయితే ఇది ఇప్ప‌ట్లో తెమిలే వ్య‌వ‌హారం కాదు. శంక‌ర్ సినిమా పూర్త‌య్యేస‌రికి చాలా కాలం ప‌డుతుంది. అందుకే... శంక‌ర్ త‌ర‌వాత ఎవ‌రితో చేయాలి? అనే విష‌యంలో చ‌ర‌ణ్ కూడా నిర్దిష్టంగా ఓ నిర్ణాయ‌నికి రాలేద‌ట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS