పెద్ద సినిమాలన్నీ విడుదలకు రెడీ అవుతూ.. రిలీజ్ డేట్లు ప్రకటించుకుంటున్నాయి. అయితే ఆచార్య నుంచి ఎలాంటి అలికిడీ లేకపోవడం మెగా ఫ్యాన్స్ ని విస్తుపరుస్తోంది. నిజానికి ఆగస్టులో ఈ సినిమా వస్తుందనుకున్నారు. ఆ తరవాత అక్టోబరు అన్నారు. ఇక ఇప్పుడు సంక్రాంతి అంటున్నారు. అప్పుడూ ఈ సినిమా డౌటే అనే కామెంట్లు వినిపించాయి. దాంతో ఆచార్య రిలీజ్ ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనే అనుమానాలు నెలకున్నాయి. అయితే ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. రిలీజ్ డేట్ పక్కా అయ్యింది.
అక్టోబరు 1న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేసుకుంటోంది. అక్టోబరు 13న ఆర్.ఆర్.ఆర్ విడుదల అవుతోంది. అంటే.. ఆచార్యకీ ఆర్.ఆర్.ఆర్‌కీ రెండు వారాల గ్యాప్ ఉంటుందన్నమాట. ఈ మాత్రం గ్యాప్ చాలన్నది చిరు ఆలోచన. నిజానికి ఆచార్య, ఆర్.ఆర్.ఆర్ రెండు సినిమాల్లోనూ రామ్ చరణ్ ఉన్నాడు. కాబట్టి, ఈ రెండు సినిమాల మధ్య కనీసం రెండు నెలల గ్యాప్ ఉండాలనుకున్నారు. కానీ.. అది సాధ్యం కాదని అర్థమైపోయింది. అందుకే రెండు వారాల గ్యాప్ చాలనుకుంటున్నారు. అక్టోబరు 1 దాటితే,.. సంక్రాంతి వరకూ ఆచార్యకు రిలీజ్ డేట్ దొరకదు. సంక్రాంతికి పవన్ సినిమా బరిలో ఉంది. పవన్ తో పోటీ పడడం చిరుకి ఇష్టం లేదు. కాబట్టి.. అక్టోబరు 1న ఈ సినిమాని విడుదల చేయాలని ఫిక్సయిపోయారు. త్వరలోనే ఈ డేట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం వుంది.