అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. గాసిప్స్‌లో విన్పించినట్లుగానే మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కొత్త సినిమాకి 'వినయ విధేయ రామ' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇది పక్కా మాస్ మూవీ. చరణ్‌కి కంప్లీట్ మేకోవర్ ఇచ్చేశాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.
'రంగస్థలం' సినిమాతో చరణ్ సరికొత్త ప్రయోగం చేయగా, ఈసారి మాత్రం పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో మెగా అభిమానుల్ని అలరించబోతున్నాడు మెగా పవర్ స్టార్. అందుకు తగ్గట్టుగానే అస్త్రశస్త్రాలన్నిటినీ దర్శకుడు బోయపాటి శ్రీను సమకూర్చినట్టుంది ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తోంటే. మాస్ సినిమాలకు పెట్టింది పేరైన బోయపాటి శ్రీను, చరణ్‌ని పక్కా మాస్ హీరోగా మరోమారు చూపించేందుకు సిద్ధమయ్యాడు.
చరణ్‌కి మాస్ సినిమాలు కొత్త కాదు. మాస్‌లో తిరుగులేని ఫాలోయింగ్‌ని ఇప్పటికే చరణ్ సంపాదించుకున్నాడు. ఇక, ఈ సినిమాలో చరణ్ సరసన 'భరత్ అనే నేను' ఫేం కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణ కాబోతోంది. వివేక్ ఒబెరాయ్, 'రక్తచరిత్ర' తర్వాత తెలుగులో చేస్తున్న సినిమా ఇది. హృతిక్ రోషన్ నటించిన 'క్రిష్-3'లో విలన్‌గా నటించి మెప్పించిన వివేక్ ఒబెరాయ్, 'వినయ విధేయ రామ'లో చరణ్‌తో విలన్‌గా తలపడే సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ అనే స్థాయిలో వుండబోతున్నాయట.
డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మెగా ప్రొడ్యూసర్ డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈయనే, చరణ్ - రాజమౌళి - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్' తెరకెక్కించనున్న సంగతి తెల్సిందే.