గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం లభించింది. టాలీవుడ్ హీరోలకి ఇప్పుడిపుడే వరల్డ్ వైడ్ గా ప్రాముఖ్యత దక్కుతోంది. ఇందులో భాగంగానే RRR సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ టుస్సాడ్స్ మ్యూజియం లో కొలువుతీరనుంది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఇప్పటివరకు బాలీవుడ్ ప్రముఖుల విగ్రహాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడిప్పుడే తెలుగు హీరోల స్టాట్యూలు పెడుతున్నారు. పుష్ప సినిమా తరవాత అల్లు అర్జున్ కి కూడా ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇప్పుడు చెర్రీ వంతు వచ్చింది.
లండన్‌లోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియంలో చెర్రీతో పాటు రైమ్ కూడా కొలువుతీరనుంది. రైమ్ అంటే ఎవరు అనుకుంటున్నారా? అదే నండి చెర్రీ బుజ్జి కుక్కపిల్ల. ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీస్ మైనపు విగ్రహాలు కొలువుదీరే ఈ మ్యూజియంలో చెర్రీ విత్ రైమ్ సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ మ్యూజియంలో ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ స్టాట్యూలున్నాయి. ఇపుడు లేటెస్ట్ గా చెర్రీ కూడా ఈ లిస్ట్ లో చేరుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే చెర్రీ ఉపాసన దంపతులు అంబానీ పెళ్లి వేడుకలు ముగిసిన వెంటనే అటు నుంచి అటే స్పెషల్ ఫ్లయిట్ లో లండన్ కి వెళ్లారని తెలుస్తోంది. లండన్ టూర్‌కి మెయిన్ రీజన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలతలు ఇవ్వటానికే అని సమాచారం. రైమ్ ని కూడా వీరు వెంట తీసుకుని వెళ్లారు.