రామ్ చరణ్ అమెరికా పయనమయ్యారు. మార్చి 12న జరిగే ఆస్కార్ వేడుకల్లో ఆయన పాలు పంచుకోనున్నారు. ఈలోగా అమెరికాలో కొన్ని ప్రమోషన్ కార్యక్రమాలు జరగబోతున్నాయి. వాటిలో చరణ్ పాల్గొనబోతున్నాడు. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డులలోనూ చరణ్ మెరవబోతున్నాడు. అందుకే చరణ్ అమెరికా వెళ్లాడు. ఆస్కార్ లో.. బెస్ట్ వర్జినల్ సాంగ్ విభాగంలో, నాటు నాటు పాట పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు సైతం వచ్చింది.
గోల్డెన్ గ్లోబ్ దక్కించుకొన్న పాటకు.. ఆస్కార్ రావడం ఆనవాయితీగా వస్తోంది, దాంతో.. ఈ పాటకు కచ్చితంగా ఆస్కార్ వచ్చి తీరుతుందని అందరి నమ్మకం. దానికి ముందు.. అమెరికాలో ఆస్కార్‌కి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. వాటిలో ఆర్.ఆర్.ఆర్ టీమ్ పాల్లొనబోతోంది. అందులో భాగంగానే చరణ్ అమెరికా వెళ్లాడు. ఎన్టీఆర్, రాజమౌళి కూడా త్వరలోనే చరణ్‌తో కలుస్తారు. ఇటీవలే శంకర్ సినిమా కోసం ఓ షెడ్యూల్ ముగించుకొన్నాడు చరణ్. అమెరికా పయనం వల్ల.. ఇప్పుడు ఆ సినిమాకి బ్రేక్ పడినట్టైంది.