రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదాలకు కేంద్ర బిందువు. ఆయన ఏం చేసినా అంతే. సినిమా అనౌన్స్ చేసినా అంతే, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినా, హాట్ హాట్‌గా హీటెక్కించేస్తూ ఉంటారు.ే ఆయనికి ముంబయ్‌లో 'కంపెనీ' పేరుతో ఓ ఆఫీస్ ఉంది. వర్మలానే ఆ ఆఫీస్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అది ఆఫీస్ అంటే ఆఫీస్ కాదు. సకల సౌకర్యాలు అందులోనే ఉంటాయి. ఆ ఆఫీస్‌లో చాలా రూమ్స్ ఉంటాయి. ఒక్కో రూమ్‌కి ఒక్కో పేరు కూడా ఉంటుంది. ఏం పేర్లంటారా? ఊర్మిళ, నాగార్జున, హిట్లర్, మహాత్మాగాంధీ.. ఇలా తదితర అన్ని రకాల పేర్లు ఉంటాయి. అందులోనే 'హాంటెడ్ హౌస్' పేరుతో ఓ రూమ్ కూడా ఉంటుంది. హారర్ మూవీ షూటింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. హారర్ మూవీస్‌కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఈ రూమ్‌లో పొందుపరచబడి ఉంటుంది. తాజాగా ఈ 'కంపెనీ' ఇప్పుడు హాట్ హాట్‌గా వార్తల్లోకెక్కింది. బాలీవుడ్, టాలీవుడ్ అంతా ఇప్పుడు వర్మ కంపెనీ గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన 'సర్కార్ 3' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. గతంలో వచ్చిన ఈ సినిమా 'సర్కార్' సినిమాకి సీక్వెలే ఈ సినిమా. అమితాబ్ బచ్చన్‌ని గాడ్ ఫాదర్‌గా చూపించారు వర్మ ఈ సినిమాలో. ఈ సినిమా విజయం దిశగా దూసుకెళ్లిపోతోంది. వర్మ క్రియేటివ్ డైరెక్టరే. ఆ క్రియేటివిటీ రేంజ్ ఏంటో ఈ సినిమా మరోసారి నిరూపించింది.